ఈ పాట పూర్తి సాహిత్యం మీ కోసం ఇక్కడ ఉంది:శివ రాత్రి పాట 2026 - సాహిత్యం
గానం: మౌనిక యాదవ్ & దిలీప్ దేవ్గన్.
సంగీతం: జాను ల్యారి (Janulyri Music).
శైలి: తెలంగాణ జానపద శివ భక్తి గీతం.
పల్లవి:
ఆడెడో ఉన్నాడట కైలాస గిరులల్ల
కైలాస గిరులల్ల..
వీడున్నా మనతోటి ఆడుతడే బొమ్మలాట
ఆడుతడే బొమ్మలాట..
ఆ సిక్కుల జుట్టు సిగలో గుట్టు
నల్లని నాగు ఆమెడ చుట్టు..
ఎవలే ఎవలాన్నో ఎవులాడ రాజన్న
అరె పలకవు ఏందిన్నన్నో పల్ల జడలా లింగన్న..
అరె ఎవలే ఎవలాన్నో ఎవులాడ రాజన్న
అరె పలకవు ఏందిన్నన్నో పల్ల జడలా లింగన్న..
అరె సెట్టు పుట్టా మన్ను మిన్ను
అంతట నీవే మూడో కన్ను..
ఎవలే ఎవలాన్నో ఎవులాడ రాజన్న
అరె పలకవు ఏందిన్నన్నో పల్ల జడలా లింగన్న
చరణం 1:
ఓ పుట్టెడు పొట్టల గుడ్డును పెడితివి
తల్లడిల్లి పురుడు పోసెనయ్య..
తల్లడిల్లి పురుడు పోసెనయ్య..
ఇరవై ఏళ్ళు పెంచుకున్న కొడుకే
కాటికి చేరెను ఎందుకయ్య..
కాటికి చేరెను ఎందుకయ్య..
ఎటుగాని బంధాలే ఎందుకయ్య కలిపేవు
మన్నులోన మమ్మే కలిపి ఎందుకు ఎడబాపేవు..
అసలెందుకయ్య ఎడబాపేవు..
ఎవలే ఎవలాన్నో ఎవులాడ రాజన్న
అరె పలకవు ఏందిన్నన్నో పల్ల జడలా లింగన్న..
అరె ఎవలే ఎవలాన్నో ఎవులాడ రాజన్న
అరె పలకవు ఏందిన్నన్నో పల్ల జడలా లింగన్న
ఆడెడో ఉన్నాడట కైలాస గిరులల్ల
కైలాస గిరులల్ల..
వీడున్నా మనతోటి ఆడుతడే బొమ్మలాట
ఆడుతడే బొమ్మలాట..
చరణం 2:
మూడు కన్నులు ఉన్నవి గదరా
మమ్ముల చూడవు ఎందుకురా..
మమ్ముల చూడవు ఎందుకురా..
ఉన్నవానికి మేడలు మిద్దెలు
లేనివాని కడుపు కోతర..
లేనివాని కడుపు కోతర..
గూడగంటి బతుకులకు ఎందుకయ్య ఈ బాధలు
అంతకంటే నీ చిత్తం శంకర తీసుకో పోరా ప్రాణం..
తీసుకో పోరా ప్రాణం..
ఎవలే ఎవలాన్నో ఎవులాడ రాజన్న
అరె పలకవు ఏందిన్నన్నో పల్ల జడలా లింగన్న..
అరె ఎవలే ఎవలాన్నో ఎవులాడ రాజన్న
అరె పలకవు ఏందిన్నన్నో పల్ల జడలా లింగన్న..
చరణం 3:
చావు పుట్టుకలు నీవే గదరా
చేయబోకు అన్యాయము..
చేయబోకు అన్యాయము..
నమ్ముకున్నది నిన్నే గదరా
చేయబోవ ఇగ సాయము..
చేయబోవ ఇగ సాయము..
ప్రతి ఏడు ఉపవాసం ఉంటాము కదరా నీకు
ఓ కంట మా మీద ఉంచు శివ నీ చూపు..
ఉంచు శివ నీ చూపు..
ఎవలే ఎవలాన్నో ఎవులాడ రాజన్న
అరె పలకవు ఏందిన్నన్నో పల్ల జడలా లింగన్న..
అరె ఎవలే ఎవలాన్నో ఎవులాడ రాజన్న
అరె పలకవు ఏందిన్నన్నో పల్ల జడలా లింగన్న..
This lyrics are for educational and promotional purposes only.
All rights belong to the respective owners.

0 కామెంట్లు